16 December 2011 ~ 0 Comments

రక్త దానం చేసుకోండి – తోటి వారి ప్రాణాల్ని కాపాడండి

Blood Donor Registration Form this lik http://www.manajammikunta.com/2011/12/blood-donor-registration-form.html ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తము అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయ పడుతుంది. ప్రమాదానికి గురైనవారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్త్రచికిత్స రక్తం కావలసిన రోగులకు, మీ రక్తాన్ని పరీక్ష చేసిన తరువాత నేరుగా ఉపయోగిస్తారు. గాయాలకు గురైన రోగులకి, రక్తహీనతతో బాధపడే రోగులకి మరియు ఇతర శస్త్రచికిత్స ఎర్ర రక్త కణాలు మాత్రమే కావలసి వస్తాయి. [...]

26 November 2011 ~ 0 Comments

కిషన్‌జీది నిజమైన ఎన్‌కౌంటరేనా?

కోల్‌కతా/జార్‌గ్రామ్: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీది నిజమైన ఎన్‌కౌంటరేనా? లేదా బూటకపు ఎన్‌కౌంటరా? పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా అడవుల్లో గురువారం మృతి చెందిన కిషన్‌జీ మరణంపై ప్రస్తుతం వివాదం చెలరేగుతోంది. ఆయన్ను ముందుగానే అరెస్టు చేసి, హింసించి, బూటకపు ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టారని మావోయిస్టులు, మద్దతుదారులు, పలు రాజకీయ పక్షాలు ఆరోపిస్తుండగా.. ఇది నిజమైన ఎన్‌కౌంటరేనని సీఆర్పీఎఫ్ వాదిస్తోంది. పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్నట్లు పశ్చిమ బెంగాల్ [...]

26 November 2011 ~ 0 Comments

కిషన్ జీ నమ్మకద్రోహానికి బలైపోయారా?

కోల్‌కతా: మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ నమ్మకద్రోహానికి బలైపోయారా? మావోయిస్టులకు ఆహారాన్ని అందజేస్తున్న ఒక గ్రామస్తుడు నెల్లాళ్లక్రితం పోలీసులకు చిక్కాడని, అతన్ని ఇన్ఫార్మర్‌గా మార్చుకోవడంలో వారు సఫలీకృతులయ్యారని విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తోంది. అయితే, మావోయిస్టులు ఈ సంగతి పసిగట్టలేకపోయారని, నెలరోజులుగా అతను వారితో సన్నిహితంగానే మెలిగాడని తెలుస్తోంది. కుష్బోనీకి కొందరు నాయకులు వచ్చారని మంగళవారం అతను పోలీసులకు సమాచారం అందించాడంటున్నారు. వచ్చినవారు పెద్ద నాయకులు అయి ఉండొచ్చని చెప్పడంతో వారిలో కిషన్ జీ [...]

01 August 2011 ~ 4 Comments

నెట్ బిగుస్తోంది! పరువు జారుతోంది!!

ఇప్పటి దాకా మన దేశంలో వెబ్‌సైట్లపై కానీ బ్లాగ్‌లపై కానీ ఎటువంటి నియంత్రణ లేదు. అశ్లీలమైన చిత్రాలను ఉంచే వెబ్‌సైట్లను కూడా ప్రభుత్వం ఎప్పుడూ నియంత్రించడానికి ప్రయత్నించలేదు. అయితే, ఇటీవలి కాలంలో సమాచారాన్ని అందించే అన్ని రంగాలపైనా నియంత్రణ కోసం ప్రభుత్వం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది. దీనిని అంతర్జాతీయ సంస్థలు కూడా గుర్తించాయి. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడం హౌస్ చేసిన సర్వేలో భారత్‌కు 17వ స్థానం లభించింది. భావ స్వేచ్ఛపై సర్కారు ఉక్కుపాదం.. ఐటీ [...]

31 July 2011 ~ 2 Comments

ఏరులై పారుతున్న నాటు సారా

మండలంలోని పలు గ్రామాలలో నాటు సారా ఏరులై పరుతుంది. కోంత మంది నాటు సారాను వ్యాపారంగా చే సుకోని నిత్యం మూడు పువ్వులు ఆరు కాయ లుగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పేద ప్రాణా లతో చేలగాటం ఆడుతూ నిండు కుటుంబాల లో నిప్పులు పోస్తున్నారు. ప్రభుత్వ నిబందనా లను వ్యతిరేకెస్తు నాటు సారాను ఆరికట్టే ఎకై్స జ్‌ ఆధికారులు మామూళ్ళ మత్తులో చూసి చూ డనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు బహో టంగా ఆరోపిస్తున్నారు. నాటు సారా పుణ్యమా [...]

31 July 2011 ~ 1 Comment

మొదటి నుంచి ఆటంకాలే

ధరూరు మండలం రేవులపల్లి జూ రాల ప్రాజెక్టు దగ్గర నిర్మించిన జలవిద్యుతు ప్రాజెక్టుకు మొ దటి నుండే ఆటంకాలు ఎదురయ్యాయి. 2003 సంవత్సరం డిసెంబరు మాసంలో రూ.547కోట్ల వ్యయంతో ప్రాజెక్టు ప నులు ప్రారంభమయ్యాయి. మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 234 మోగావాట్ల విద్యుత్తు ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో రూ.110కోట్ల పనులు పటేల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ దక్కిం చుకోగా, మిగతా ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ పనులను సీఎం ఈసీ అనే చైనా కంపెనీ దక్కించుకుంది. పటేల్‌ కంపెనీకి [...]

31 July 2011 ~ 3 Comments

కష్టాల కడలిలో కౌలు రైతులు

 రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను దృష్టిలో పెట్టుకొని నూతనంగా ఏర్పాటు చేసి కౌలు దారు చట్టం అధికారుల నిర్లక్ష్యంతో అమలుకు నోచుకోవడం లేదని చెన్నూర్‌, కోటపల్లి, వేమనపల్లి మండల రైతులు ఋణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిసినందులకు వ్యవసాయంపై ఈ ఏడాది పంట సాగులపై ఎంతో ఆశతో అధిక దిగుబడి సాధించవచ్చు అనుకున్న తరుణంలో వరణుడి సహకారం లేక రెండు నెలల కాలం గడిచిన నేటికి కుంటలు, [...]

31 July 2011 ~ 1 Comment

స్వీట్లు వద్దు స్వీట్‌ ముద్దులు కావాలి

అమ్మాయిలతో ఆటలాడుకోవడం ఆయన హబీ.. ఏదైన సందు దొరికితే చాలు పెద్ద ఎత్తున వసూలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. బలహీనతల ఆదారంగా బ్లాక్‌మెయిల్‌ చేయడం ఆయనకు మరింత ప్రియం… పనులు కావాలంటే పడక వేయాల్సిందేనని హుకుం జారీ చేయడం ఆయనకు మరింత హాబీ. గతంలో టీఎఫ్‌సీ నిధులు లక్షలాది రూపాయలు తన సొంత ఖాతాకు మళ్లీంచుకోవడమే కాకుండ ఏసీబీ వలలో చిక్కుకున్న ఆయన బుద్ది మాత్రం ఇంకా కుక్కతోక వంకరే అన్న చందంగా ఉంది. [...]

31 July 2011 ~ 1 Comment

డబ్బు, బంగారం ‘గోదావరి’పాలు

విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ , హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోనూ దొంగలు పడ్డారు. దీంతో గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. సుఖమయ ప్రయాణం, సురక్షితంగా గమ్యం చేర్చే ఈ రైలంటే అందరికీమోజు. ఇప్పుడు ఈ రైలు పేరు చెబితే ప్రయాణికులు భయపడుతున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన రెండు దోపిడీలే ఇందుకు కారణం. శుక్రవారం ఉదయం విశాఖ చేరుకున్న ప్రయాణీకులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు [...]

31 July 2011 ~ 1 Comment

మునగాకు ఎంతో మేలమ్మా !

కవిటి,మేజర్‌న్యూస్‌: మునక్కాయతో చేసిన ఏ వంటకమైన చాలా మంది ఇష్టపడతారు.ఇవి రుచిగా ఉండటమే కాకుండా,ఆరోగ్యానికి మంచిది కావడంతో ఎక్కువగా తింటుంటారు.అయితే మునగ కాయలతో పాటు ఆకులతోను కూరలు చేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ప్రోటీన్లు,విటమిన్లు,మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి.ఇవి ఆహారంగానే కాకుండా అనేక రుగ్మతలకు దివ్య పధంగా పనికొస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఆహారపు విలువలు ఎక్కువగా ఉంటే ఆకు కూరల్లో మునగాకు శరీరానికి మేలు చేసేదిగా చెప్పవచ్చును.తోటల్లో మునగచెట్లు ఎక్కువగా ఉంటాయి.కవిటి ఉద్ధానం ప్రాంతాల్లో చాలా మంది [...]

31 July 2011 ~ 1 Comment

తగరా తమ్ముడూ..! ఆపకు అమ్మడూ..!!

రాష్ర్టం ఆడా మగా తేడా లేకుండా మద్యం మత్తులో మునిగితేలుతోంది. హైటెక్‌ కల్చర్‌ పేరుతో పెరిగిన పబ్‌లు, బార్లు వెలియడంతో క్లాస్‌, మాస్‌ తేడా లేకుండా తెలుగు వారు మద్యాన్ని మంచినీళ్ళలా తాగేస్తున్నారు. అందులో నూనూగు మీసాల కుర్రాళ్ళ నుంచి కాటికి కాలు చాచిన తాతయ్యలూ ఉండగా, తామేమి తక్కువ కాదని అన్నిట్లో 50 శాతం రిజర్వేషన్లు సాదించిన అతివలు పురుషులపై తాగుడులో పైచేయి సాదిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర మద్య సేవనంలో జనాభాలో 60 శాతం మంది [...]

07 May 2011 ~ 14 Comments

అమెరికా, భారత్‌ లకు పాక్ హెచ్చరిక

ఇస్లామాబాద్: తమ దేశంలోనే తమకు తెలియకుండా అమెరికా ఆపరేషన్ జరిపి అంతర్జాతీయ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చడంపై పాకిస్తాన్ ఆగ్రహం ఇంకా చల్లారనట్టే కనిపిస్తోంది. లాడెన్ చంపిన తరహా ఆపరేషన్‌లు మరిన్ని పాకిస్తాన్‌లో జరుపుతామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో పాక్ తీవ్రంగా స్పందించింది. ఆలాంటి ఆపరేషన్‌లు మరిన్ని జరిపితే తాము తీవ్రంగా స్పందిస్తామని చెప్పింది. అలా చేస్తే అమెరికాను వదిలే పరిస్థితి ఉండదని హెచ్చరించింది. అవసరమైతే అమెరికాతో సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో [...]

07 May 2011 ~ 13 Comments

2జీ స్కాం లో కనిమొళి హాండ్

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కనిమొళికి ప్రత్యక్ష సంబంధం ఉందని సిబిఐ వాదించింది.  డీఎంకే ఎంపీ కనిమొళికి ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరింది. ముందస్తు బెయిల్ ‌కోసం కనిమొళి పెట్టుకున్న దరఖాస్తుపై సిబిఐ కోర్టులో వాదనలు జరిగాయి.  కలైంగర్ టీవీ ఛానల్‌లో ఆమె పాత్రపై సీబీఐ తన వాదనలు వినిపించింది. కలైంగర్ టీవీ ఛానల్‌ను నిర్వహణలో కనిమొళిది కీలక పాత్రగా సీబీఐ పేర్కొంది. కలైంగర్ ఛానల్‌లో ఆమె సూత్రధారి మాత్రమే [...]

07 May 2011 ~ 2 Comments

మరో రెండు రోజుల పాటు ఆయన ఐసియులోనే

చెన్నై:  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే, మరో రెండు రోజుల పాటు ఆయన ఐసియులోనే ఉండాల్సి వస్తుందని వైద్య వర్గాలు శనివారం చెప్పాయి. అరవై ఏళ్ల రజనీకాంత్ ఎలర్జీక్ బ్రాంకైటిస్, జ్వరంతో బాధపడుతూ బుధవారం రాత్రి ఇసాబెల్ ఆస్పత్రిలోని ఐసియులో చేరారు. రెండు రోజుల పాటు ఐసియులో ఉన్న తర్వాతనే రజనీకాంత్ డిశ్చార్జీపై నిర్ణయం తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. రజనీకాంత్ ఆస్పత్రి పాలు కావడం వారంలో ఇది రెండో సారి. [...]

07 May 2011 ~ 8 Comments

త్వరలో రాష్ట్ర కాంగ్రెసులో కీలక మార్పులు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, కడప ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర కాంగ్రెసులో కీలకమైన మార్పులు చేయడానికి పార్టీ అధిష్టానం సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా మంత్రి దామోదర రాజనర్సింహను నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గత డిసెంబర్‌లోనే ఎస్సీ, తెలంగాణకు చెందిన నాయకుడు కావడం [...]

04 May 2011 ~ 3 Comments

కొడుకులు ఆల్ ఖైదాలోకి వద్దని భార్యలకు చెప్పిన లాడెన్

న్యూఢిల్లీ: తన మరణం తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవద్దని, తన పిల్లలను ఆల్ ఖైదాలో చేర్చవద్దని అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కోరినట్లు ఓ వార్తాపత్రిక రాసింది. ఈ మేరకు ఆయన తన వీలునామాలో రాసినట్లు కువైట్ వార్తాపత్రిక ఆల్ – అంబా తెలిపింది. ఈ వీలునామాను వ్యక్తిగతమూ రహస్యమూ అంటూ చెప్పాడని, దాన్ని అమెరికాపై దాడుల తర్వాత 2001 డిసెంబర్ 14వ తేదీన రాశాడని తెలిపింది. ఈ సమయంలో లాడెన్ కోసం అమెరికా బలగాలు [...]

04 May 2011 ~ 5 Comments

అణు ప్రమాదం గురించి జపాన్‌కు ముందే తెలుసు: వికీలీక్స్

జపాన్‌కు అణు ప్రమాదం పొంచి ఉన్న సంగతి ముందుగానే ఆ దేశానికి తెలుసునని రహస్య పత్రాలను వెల్లడి చేసే వెబ్‌సైట్ వికీలీక్స్ పేర్కొంది. జపాన్‌లో అధిక తీవ్రత కలిగిన పెను భూకంపం సంభవిస్తే అక్కడ ఉన్న అణు విద్యుత్ కేంద్రాలకు ముప్పు వాటిళ్లే అవకాశం వుందని గతంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) జపాన్‌ను హెచ్చరించినట్లు వికీలీక్స్‌ను ఉటంకిస్తూ.. బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. రిక్టర్ స్కేల్‌ (భూకంపం తీవ్రతను కొలిచే కొలమానం)పై [...]

04 May 2011 ~ 4 Comments

ఒసామా బిన్ లాడెన్ మృతి

వాషింగ్టన్: ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. లాడెన్ మృతిపై త్వరలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటన చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. లాడెన్ మృతదేహం అమెరికా ఆధీనంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆల్ జజీరా చానెల్ కూడా లాడెన్ మరణించిన వార్తను ప్రసారం చేసిటన్లు తెలుస్తోంది. లాడెన్ మరణించినట్లు డిఎన్ఎ పరీక్షలు కూడా ధ్రువీకరించిట్లు చెబుతున్నారు. అతను ఎలా మరణించాడనే విషయం మాత్రం తెలియడం లేదు. సౌదీలో జన్మించిన ఆల్ [...]

04 May 2011 ~ 2 Comments

అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ మృతి

ఇటానగర్: హెలికాప్టర్ ప్రమాదంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీఖండూ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా తవాంగ్లోని లోబ్తాన్ లో జంగ్ జలపాతం వద్ద కుప్పకూలినట్లు తెలుస్తోంది. దోర్జీఖండూ సహా అయిదుగురి మృతదేహాలు లభ్యం అయినట్లు సమాచారం. కాగా దోర్జీఖండూ మృతిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ముఖ్యమంత్రి దోర్జీఖండూ సహా నలుగురు అధికారులు ఏప్రిల్ 30న తవాంగ్ నుంచి ఇటానగర్ వెళుతుండగా హెలికాప్టర్ అదృశ్యమైన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ [...]

28 April 2011 ~ 1 Comment

ఆమాద్మీ కోసమా? పెట్టుబడిదారుల కోసమా?

పెట్టుబడిదారులు, వారికి గులాములుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దలూ, కలిసి కూర్చుని మాట్లాడుకుని రూపొందించే విధానం సామాన్య మానవునికి ఎలా అనుకూలంగా వుంటుంది? 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో ప్రస్తుత మంత్రిగారు ఎలాంటి లొసుగులూ లేవనీ, కేవలం వ్యవస్థాగత లోపాలు జరిగాయనీ చెప్పడం మనం గుర్తు చేసుకోవాలి. సేవా కార్యక్రమాలను, దేశ రక్షణకూ బాధ్యత వహించే బిఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటిఎన్‌ఎల్‌ లాంటి పిఎస్‌యులను, ఉద్యోగ సంఘాలనూ విధాన రూపకల్పనలో భాగస్వాములను చేసి మెరుగైన, సామాన్యునికి అందుబాటులో ఉండే నూతన టెలికం విధానాన్ని రూపొందించే [...]

28 April 2011 ~ 3 Comments

విధి వంచన కాదు, విధాన వంచన!

2005లో అమెరికాలో పండిన మొత్తం పత్తి విలువ 390 కోట్ల డాలర్లు. కానీ పత్తికి అమెరికా ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ 470 కోట్ల డాలర్లు! డబ్ల్యూటీవో ఒప్పందం ప్రకారం డంపింగ్‌ను అడ్డుకునే హక్కు మనకుంది. విభిన్నరేట్లను నిర్ణయించడం, సుంకాలను పెంచడం ద్వారా అడ్డుకోవచ్చు. కానీ మనం ఇలా చేశామా? లేదు. 1990లో జీడీపీలో 14.5% ఉన్న ప్రభుత్వ అభివృద్ధి వ్యయం 2005 నాటికి 5.9% నికి తగ్గింది. దీనివల్ల గ్రామీణ భారతం ఏటా రూ.1.2 నుంచి 1.5 [...]

28 April 2011 ~ 3 Comments

వ్యవసాయ సబ్బిడీలపై వేటు ఆహార భద్రతకు చేటు

సమాచార హక్కు చట్టం కింద డక్కన్ క్రానికల్ పత్రిక అడిగిన ప్రశ్న కు బదులుగా “రోజుకు ఏడుగురు రైతులు చనిపోతున్నారని” ప్రభుత్వం ఇచ్చిన సమాచారం  ఇక్కడచదవండి http://hridayam.files.wordpress.com/2007/02/seven-farmers-per-day.pdf లక్ష మంది రైతన్నల ఉసురు తీశారు గదరా… ఇది నా హృదయానికి చాలా దగ్గరి విషయం. స్వతహాగా వ్యవసాయ కుటుంబం నుండి రావటం వల్లనేమో. రైతుల వెతలు నన్నెప్పుడూ ఆందోళన పెడుతూనే ఉంటాయి. మనం “సృష్టిస్తున్న” కొత్త బంగారు లోకపు ఫలాలను అందుకోలేని రైతన్నలు పిట్టల్లా రాలిపోతున్నారు. గడచిన 15 ఏళ్లుగా [...]

28 April 2011 ~ 1 Comment

అంగళ్లుగా మారుతున్న వర్శిటీలు

యూనివర్సిటీలో పరిపాలన పట్టాలు తప్పింది. ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా పారదర్శకత లోపించింది. ఇచ్చిన నోటిఫికేషన్‌, నియమ నిబంధనలను అతిక్రమించి తన వందిమాగధులకు పోస్టులు కట్టబెట్టారు. అర్హతలు వున్నవారు ఇంటర్వ్యూలకు హాజరైన వారిని ప్రక్కనబెట్టి ఇష్టానుసారం వ్యవహ రించారు. విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతుల నియామకం, వర్సిటీల్లో జరుగుతున్న అవినీతి క్యాంపస్‌ విద్యార్థుల్లో చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 42 యూనివర్సిటీలు వుండగా వాటిల్లో సంప్రదాయ యూనివర్సిటీలు 20 ఉన్నాయి. ఉపకులపతుల కాలపరిమితి అన్ని వర్సిటీల్లో జూన్‌ చివరికి ముగియనుంది. ఇప్పటికే ఉస్మానియా, [...]

28 April 2011 ~ 8 Comments

రక్షణ ఒప్పందం వెనుక అమెరికా అసలు వ్యూహం

భారత, అమెరికా మధ్య రక్షణ ఒప్పందాలకు సంబంధించి వాణిజ్యపరమైన కోణాల గురించి అనేక విషయాలను వ్యూహాత్మక, రక్షణ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. భారత రక్షణ మార్కెట్‌ను అమెరికా సరఫరాదారుల కోసం తెరిచి ఉంచడంపై అనేక వ్యాసాలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. భారత మార్కెట్‌లో వేలాది బిలియన్‌ డాలర్ల మేరకు వ్యాపారం చేసుకునే అవకాశాలు అమెరికా కంపెనీలకు ఉన్నాయి. రానున్న కొద్ది మాసాల్లో భారత్‌ 14 బిలియన్‌ డాలర్ల మేరకు రక్షణ పరికరాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని కేబుల్స్‌ [...]

28 April 2011 ~ 1 Comment

నీతిలేని యాజమాన్యం

ఆర్థిక నష్టాలను సాకుగా చూపి యాజమాన్యం సంస్థను ప్రైవేటు వ్యక్తులకు విక్ర యించేందుకు ప్రయత్నిస్తోందని పైలెట్ల సంఘం ప్రధాన కార్యదర్శి కెప్టెన్‌ కపూర్‌ విమ ర్శించారు. సంస్థ ప్రస్తుత యాజమాన్య నియామకాన్ని పునస్సమీక్షించి పూర్వవైభవాన్ని కాపా డేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఎయిరిండియాలో విలీన మైన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పైలెట్లు తమకు మాతృ సంస్థ సిబ్బందితో సమానంగా వేతనాలివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న వేతనాలు మాతృ సంస్థ సిబ్బందికన్నా [...]

28 April 2011 ~ 4 Comments

హెచ్చరికలు లేకుండా హఠాత్తుగా కాల్పులు

పొత్తిళ్లపాపతో స్నానాల గదిలో దాక్కున్న బాలింత వెల్లడైన పోలీసుల పాశవిక ప్రవర్తన పదేళ్ల బాలుడినీ వదల్లేదు జైతాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజల్లో స్థైర్యం నింపేందుకు, పోలీసు కాల్పుల భాధితులను పరామర్శించేందుకు మహారాష్ట్ర సిపిఐ(ఎం) బృందం రత్నగిరి జిల్లాలోని కొంకణ్‌ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు స్థలాన్ని గత 24వ తేదీన సందర్శించింది. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ ధావళె నేతృత్వంలోని ఈ బృందంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ [...]

28 April 2011 ~ 4 Comments

పరిహారం అడిగిన రైతులపై లాఠీ

ఓ శీతల గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మిర్చిని కోల్పోయి నష్టపరిహారం అడిగిన రైతులపై బుధవారం పోలీసులు లాఠీఛార్జీ చేశారు. స్థానికఅంకిరెడ్డిపాలెం బైపాస్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత శ్రీసాయి సూర్య శీతల గిడ్డంగిలో సుమారు 50 వేల టిక్కీల మిర్చి అగ్ని ప్రమాదంలో మాడి మసై పోయింది. రైతులకు రూ.15కోట్లు, గిడ్డంగి యజమానికి మరో రూ.5 కోట్ల నష్టం జరిగింది. దగ్ధమైన మిరప పంటకు నష్టపరిహారం కోరుతూ రైతులు గుంటూరు-నరసరావుపేట రహదారిని దిగ్బంధించారు. వాహనాల రాకపోకలు [...]

28 April 2011 ~ 0 Comments

మంత్రి సాక్షిగా వాస్తవమైన దోపిడీ

మిర్యాలగూడ మార్కెట్‌యార్డులో తేమ పేరుతో గత వారం రోజులుగా ట్రేడర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్న వైనం మంత్రి సాక్షిగా వెలుగు చూసింది. బుధవారం స్థానిక మార్కెట్‌యార్డును పౌరసరఫరాల శాఖా మంత్రి శ్రీధర్‌బాబు సందర్శించి రైతుల గోడు విన్నారు. తేమ పేరుతో తమను దోచుకుంటున్నారని, నాణ్యమైన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు మంత్రి ఎదుట వాపోయారు. స్పందించిన మంత్రి ప్రతి కుప్ప దగ్గరికి వెళ్లి ధాన్యం నాణ్యత, తేమ నిర్ధారణను పరిశీలించారు. ధాన్యంలో 17 [...]

28 April 2011 ~ 4 Comments

ముగిసిన అంత్యక్రియలు

సత్య సాయిబాబా అంతిమసంస్కారం పూర్తయ్యింది. తాను జీవించి ఉన్నప్పుడు భక్తులకు దర్శనమిచ్చిన కుల్వంత్‌ హాలులోనే సత్యసాయిని సమాధి చేశారు. సత్యసాయి సోదరుని కుమారుడు రత్నాకర్‌ అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వాని, కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా ప్రకటించినట్లు బుధవారం ఉదయం 8.30 గంటలకు అంతిమ సంస్కార కార్యక్రమం ప్రారంభమైంది. 10.28కి సమాధి చేయడంతోపాటు మంగళ హారతి పూర్తయ్యింది. [...]

26 April 2011 ~ 4 Comments

భారత్ నుంచి నల్లధనం వరదలా వస్తోంది:వికీలీక్స్ వ్యవస్థాపకుడు

ప్రపంచం మొత్తమ్మీద చూసినప్పుడు భారతదేశం నుంచి వస్తున్న నల్లధనమే ఎక్కువని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అస్సాంజే చెప్పారు. ఓ ప్రైవేట్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ… స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బును డిపాజిట్ చేస్తున్నవారిలో భారత దేశానికి చెందినవారే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తున్నారని చెప్పుకొచ్చాడు. నల్లధనం రూపేణా దాచుకుంటున్నవారిలో భారతదేశానికి చెందినవారే అధికులనీ, వారి పేర్లు తమ వద్ద ఉన్నాయని ప్రకటించాడు. కోట్లకు కోట్లు నల్లధనాన్ని ఇండియన్స్ ఇక్కడ దాచుకున్నారనీ, బ్లాక్ మనీపై భారతదేశంలో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆ డబ్బును [...]